క్రిస్మస్ వేడుకలకు హాజరవ్వాలంటే...PCR టెస్ట్ తప్పనిసరి
- December 23, 2021
యూఏఈ: అబుధాబిలోని చర్చిలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తు జాగ్రత్త చర్యలను ప్రకటించాయి. చర్చిలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా PCR టెస్టులు, 'గ్రీన్ పాస్' ప్రోటోకాల్‌లు నిబంధనలను పాటించాలని కోరాయి. అబుధాబిలోని సెయింట్ జోసెఫ్ కేథడ్రల్‌లో జరిగే క్రిస్మస్ మాస్‌లకు హాజరయ్యేందుకు 96 గంటల్లోగా పీసీఆర్ పరీక్ష ఫలితం నెగిటివ్‌తో అల్ హోస్న్ యాప్‌లో ‘గ్రీన్ పాస్’ పొందాల్సి ఉంటుంది. విజిట్ వీసాలో ఉన్న వారికి ఎమిరేట్స్ ID లేదా పాస్‌పోర్ట్ ద్వారా మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేసింది. సెయింట్ ఆండ్రూస్ చర్చిలో ప్రవేశించడానికి 48 గంటల ముదు చేయించుకున్న PCR పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని చర్చి ప్రతినిధులు తెలిపారు. సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ కేథడ్రల్ ఫాదర్ ఎల్డో ఎమ్ పాల్ మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ సంవత్సరం సాంప్రదాయ క్రిస్మస్ కరోల్స్ నిర్వహించలేదన్నారు. చర్చిల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, సురక్షితమైన భౌతిక దూరాన్ని పాటించాలని చర్చిల ప్రతినిధులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..