శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే
- December 24, 2021
తిరుమల: శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే తన సతీమణి షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీలంక ప్రధాని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.ఆ తరువాత జెఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు నారాయణస్వామి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







