హౌతీ మిలీషియా రాకెట్ దాడిలో ఇద్దరు సౌదీ పౌరులు మృతి..
- December 25, 2021
సౌదీ అరేబియా: హౌతీ మిలీషియా దాడిలో ఇద్దరు సౌదీ అరేబియా పౌరులు మృతి చెందారు. సౌదీలోని జజాన్ లో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో ఒక సౌదీ, ఒక యెమెన్ వాసి మరణించారని అధికారులు తెలిపారు.ఈ రాకెట్ దాడిలో జజాన్‌లోని సమ్తాహ్లోని వర్క్ షాప్, ఓ వాహనం కూడా దెబ్బతింది.యెమెన్‌లోని సాదా నగరం నుండి ఈ రాకెట్ ను ప్రయోగించారని, దాడికి ప్రతిస్పందనగా వైమానిక దాడులు చేసినట్లు యూనైటెడ్ అరబ్ తెలిపింది.ఈ దాడుల్లో యెమెన్‌లోని అల్-మహ్విత్ గవర్నరేట్‌లో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసే నాలుగు డిపోలు,సాదాలో బాలిస్టిక్ క్షిపణులు,ఆయుధాలను నిల్వ చేసే రెండు గుహలు కూడా ధ్వంసమయ్యాయని యూనైటెడ్ అరబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







