12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ పనులు
- December 26, 2021
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” ఇప్పుడు నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. “ట్రైలర్‌లో చూపిన విఎఫ్‌ఎక్స్ వర్క్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రెడిట్ మొత్తం విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ కమల్ కణ్ణన్‌కే చెందుతుంది. సినిమా కోసం అత్యుత్తమ అవుట్ పుట్ అందించడానికి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ‘రాధే శ్యామ్’ విఎఫ్ఎక్స్ పనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 దేశాల్లో జరుగుతున్నాయి” అని రాధా కృష్ణ అన్నారు.
“రాధే శ్యామ్” విఎఫ్ఎక్స్ పనులు 12 దేశాల్లో జరుగుతున్నాయని దర్శకుడు చెప్పడం చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మాట్లాడుతూ “రాధే శ్యామ్” అందమైన విజువల్ కథనాన్ని అందిస్తారని, పెద్ద స్క్రీన్‌లపై మిస్ కాకూడదని అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన “రాధే శ్యామ్”ను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడుతుందా ? అనుకున్న సమయానికే వస్తుందా ? అంటే అది నిర్మాతల చేతుల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు దర్శకుడు రాధాకృష్ణ.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







