భారత్ సంచలన నిర్ణయం..ఇకపై విమానాల్లో భారత సంగీతం మాత్రమే వినిపించాలి!
- December 29, 2021
న్యూ ఢిల్లీ: ఇకపై విమనాలు, విమానాశ్రయాల్లో కేవలం భారత సంగీతం మాత్రమే వినపడనుంది. ఇతర దేశాలకు సంబంధించిన సంగీతం వినిపించదు.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ. భారత విమానయాన సంస్థలు నడిపే విమానాల్లో భారత సంగీతం వినిపించేలా ప్రోత్సాహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఈనెల 23వ తేదీన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) లేఖ రాసింది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, పశ్చిమాసియా దేశాలు వారి వారి విమానాల్లో వారి దేశాలకు సంబంధించిన సంగీతం మాత్రమే వినిపిస్తున్నారని లేఖలో వెల్లడించింది. అమెరికా విమానాల్లో జాజ్, ఆస్ట్రేలియా విమానాల్లో మోజారత్, పశ్చిమాసియా దేశాల విమనాల్లో అరబ్ సంగీతాన్ని వినిపిస్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలో…ఐసీసీఆర్ ఇచ్చిన లేఖ ప్రకారం…సింధియా సిఫార్సులు జారీ చేశారు.
వీటిని పాటించాలని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్, ఏఏఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్ లకు..పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పాధి లేఖ రాశారు. భారత సంగీతానికి సుసంపన్నమైన వారసత్వం ఉందని, ప్రతి భారతీయుడు గర్వించే అనేక అంశాల్లో సంగీతం ఒకటని తెలిపారు. భారత్ లో నడిచే విమానాలత్లో భారతీయ సంగీతాన్ని వినిపించాలని ఐసీసీఆర్ సిఫార్సు చేసిందనే విషయాన్ని గుర్తు చేసింది. దీనిని విమానాయాన సంస్థలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు లేఖలో వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం







