1,070,000 యాంఫెటమైన్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న GDNC

- December 30, 2021 , by Maagulf
1,070,000 యాంఫెటమైన్ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్న GDNC

సౌదీ అరేబియా: కాఫీ ప్యాకేజీలలో దాచి సౌదీ అరేబియాలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 1,070,000 యాంఫెటమైన్ టాబ్లెట్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) అడ్డుకొని స్వాధీనం చేసుకుంది. GDNC ప్రతినిధి మేజర్ అహ్మద్ అల్-నజిది మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో దాడులు చేశామన్నారు. ఈ కేసులో నలుగురు సరఫరా దారులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇద్దరు యెమెన్‌లతో సహా ఆరుగురు డ్రగ్స్ రిసివర్స్ ను దమ్మామ్‌లో అరెస్టు చేశామని, వీరందరిపై ప్చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com