నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సైబారాబాద్ పోలీసులు

- December 30, 2021 , by Maagulf
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సైబారాబాద్ పోలీసులు

హైదరాబాద్: సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్ లు మరియు పబ్ ల యాజమాన్యంతో సైబారాబాద్ పోలీసులు సమీక్ష సమావేశo ఏర్పాటు చేయడం జరిగింది.

నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మైనర్లను అనుమతించవద్దని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని పబ్ మరియు బార్ యజమానులను సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఓమిక్రాన్‌ భయంతో పబ్‌లు, బార్‌ల యజమానులు ఆరోగ్య శాఖ విధించిన షరతులను ఉల్లంఘించరాదని, ఆంక్షల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి, శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలి మరియు వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్ కట్టుబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com