నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సైబారాబాద్ పోలీసులు
- December 30, 2021
హైదరాబాద్: సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్ లు మరియు పబ్ ల యాజమాన్యంతో సైబారాబాద్ పోలీసులు సమీక్ష సమావేశo ఏర్పాటు చేయడం జరిగింది.
నూతన సంవత్సర వేడుకల నియంత్రణను కఠినతరం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మైనర్లను అనుమతించవద్దని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని పబ్ మరియు బార్ యజమానులను సైబారాబాద్ పోలీసు కమిషనర్ సూచనల మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఓమిక్రాన్ భయంతో పబ్‌లు, బార్ల యజమానులు ఆరోగ్య శాఖ విధించిన షరతులను ఉల్లంఘించరాదని, ఆంక్షల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి, శాంతియుత వాతావరణంలో మాత్రమే వేడుకలు జరుపుకోవాలి మరియు వేడుకల సమయంలో కరోనా ప్రోటోకోల్ కట్టుబడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







