‘ఆచార్య’ మూడో పాటకు ముహుర్తం ఖరారు

- December 31, 2021 , by Maagulf
‘ఆచార్య’ మూడో పాటకు ముహుర్తం ఖరారు

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ అని హింట్ ఇస్తూ చిరు పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇక ఈ సాంగ్ లో చిరు మాస్ స్టెప్స్ తో అలరించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఫిబ్రవరి 4 న రిలీజ్ అవుటున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మెగా కాంబో ఎంతటి విజయాన్ని రాబట్టుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com