భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు
- January 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.తాజాగా భారత్‌లో 33,750 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 123 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,81,893 కి చేరింది.
కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం రోజున 27 వేలకు పైగా కేసులు నమోదవ్వగా, సోమవారం రోజున ఆ సంఖ్య 33 వేలకు చేరుకుంది.సుమారు 6 వేలకు పైగా కేసులు అదనంగా ఒక్కరోజులో పెరిగాయి.అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్కులు, జిమ్‌లు వంటి వాటిని మూసివేశారు.కార్యాలయాలు 50 శాతంతో పనిచేస్తున్నాయి.కేసులు ఇలానే పెరిగితే మరిన్ని ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







