వరదల నేపథ్యంలో కువైట్‌లో స్కూళ్లకు సెలవు

- January 03, 2022 , by Maagulf
వరదల నేపథ్యంలో కువైట్‌లో స్కూళ్లకు సెలవు

కువైట్: వరదల నేపథ్యంలో కువైట్‌లో స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించారు.10, 11 తరగతుల విద్యార్థులతో పాటు మిడిల్ స్కూల్ స్థాయిలలో సోమవారం జరగాల్సిన అన్ని ఫైనల్ పరీక్షలను రద్దు చేశారు. వాటిని ఒక రోజు తర్వాత నిర్వహించనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్‌లో చాలా వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున, భారీ వర్షాల కారణంగా వరదలు, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పరీక్షల షెడ్యూల్‌ను మార్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ అల్-యాకూబ్ ఆదివారం తెలిపారు. పరీక్ష రోజు COVID-19 వ్యాప్తిని అరికట్టే ఆరోగ్య జాగ్రత్తలను అందరూ కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com