ఆమ్నెస్టీ పై క్లారిటీ ఇచ్చిన షార్జా పోలీసు
- January 03, 2022
షార్జా: చట్టవిరుద్ధంగా షార్జాలో నివసిస్తున్న వారికి షార్జా తీపి కబురు చెప్పిందని.. కొంత మొత్తం చెల్లించి, శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో ఆసియాకు చెందిన వర్కర్లు..పెధ్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు చేరుకుని,ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలో షార్జా పోలీసు అధికారులు స్పందించారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఆమ్నెస్టీ వార్తలను ఖండించారు. ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు.ఇదే సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని ఉద్దేశించి హెచ్చరించారు.తప్పుడు ప్రచారాలకు పాల్పడే వారిని పట్టుకునే టెక్నాలజీ తమ వద్ద ఉందనీ.. పుకార్లు సృష్టిస్తే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటువంటి నేరాలకు పాల్పడితే.. జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







