ఒక్కరికి కరోనా.. చిక్కుకుపోయిన 2000 మంది
- January 03, 2022
పనాజీ: ముంబయి నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్ నౌకలో కరోనా కలకలం రేగింది. నౌకలోని సిబ్బంది ఒకరికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దాదాపు 2వేల మందికి పైగా ప్రయాణికులు గోవా తీరంలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది.
ముంబయి పోర్ట్ నుంచి 2016 మంది ప్రయాణికులు, సిబ్బందితో గోవా బయల్దేరిన కార్డెలియా క్రూజ్ నౌకలో సిబ్బంది ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నౌకలో వైద్యులు ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె ఆదివారం వెల్లడించారు. కరోనా సోకినట్లు తేలగానే నౌకను గోవా తీరంలో నిలిపేందుకు అధికారులు అంగీకరించలేదు. దీంతో మోర్ముగావ్ తీరంలో నిలిపారు.
అప్రమత్తమైన అధికారులు నౌకలోని వారందరికీ పరీక్షలు ప్రారంభించారు. ఆదివారం రాత్రి 9.30గంటలకు ఓ వైద్య బృందం నౌకలోకి వెళ్లి ప్రయాణికులందరికీ పరీక్షలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులెవరూ నౌక నుంచి దిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. దీంతో నిన్నటి నుంచి వారంతా షిప్‌లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా.. నౌకలో ఎక్కిన వారంతా రెండు డోసుల టీకా తీసుకున్నవారేనని కార్డెలియా క్రూజ్ ప్రతినిధులు తెలిపారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని ప్రస్తుతం నౌకలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







