క్లాసుల్లేకుండా యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారికి దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్
- January 03, 2022
యూఏఈ: యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారికి డ్రైవింగ్ క్లాసులు లేకుండానే దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ లభించనుందని రోడ్స్ మరియు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ పేర్కొంది. ఏ దేశస్తులు లైసెన్స్ కోరుతున్నారో, ఆయా దేశాల్లోని తమ లైసెన్సుని ఇందుకోసం సమర్పించాల్సి వుంటుంది. వీటితోపాటుగా ఒరిజినల్ ఎమిరేట్స్ ఐడీ, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, నాలెడ్జ్ టెస్ట్ మరియు రోడ్ టెస్ట్ రిజల్ట్ వివరాల్ని సమర్పించాల్సి వుంటుంది. యూఏఈ, ఎక్కువ కాలం యూఏఈలో నివసించేందుకు వీలుగా విదేశీయులకు గోల్డెన్ వీసా సౌకర్యాన్ని కల్పిస్తోంది. స్పాన్సర్ లేకుండానే యూఏఈలో తమ వ్యాపారాల్ని వీరు నిర్వహించుకోవచ్చు. ఈ వీసాలు 5 మరియు పదేళ్ళకుగాను మంజూరు చేస్తారు. నవంబర్ నాటికి 44,000 మంది గోల్డెన్ వీసాల్ని పొందారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







