సౌదీ రైల్వేలో కొత్త శకం.. ట్రైన్స్ నడుపనున్న మహిళా డ్రైవర్లు

- January 04, 2022 , by Maagulf
సౌదీ రైల్వేలో కొత్త శకం.. ట్రైన్స్ నడుపనున్న మహిళా డ్రైవర్లు

సౌదీ: సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో ట్రైన్స్ నడపడంలో మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్అనంతరం హరమైన్ హై స్పీడ్ రైల్వేలో వీళ్ళు ట్రైన్స్ నడుపనున్నారు. జనవరి 2న ప్రకటించిన ఈ SRP ప్రాజెక్ట్.. పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల మధ్య నిర్వహించనున్నారు. శిక్షణ ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ట్రైనీలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. జనవరి 15 నుండి జెడ్డాలో ఈ తరగతులు ప్రారంభం అవుతాయి. ట్రైనీలకు మెడికల్ ఇన్సూరెన్స్, జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్‌లో రిజిస్ట్రేషన్ తోపాటు శిక్షణ కాలంలో నెలవారీ SR4,000 ($1,065) బోనస్‌తో సహా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ట్రైనింగ్ తర్వాత హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న కంపెనీలలో ఒకటైన రెన్ఫే KSA లో ఉద్యోగం లభిస్తుంది. మహిళా గ్రాడ్యుయేట్లు సౌదీ అరేబియా రైల్వేస్‌లో ఉద్యోగం పొందిన తర్వాత, వారికి నెలకు SR8,000 వరకు జీతం అందుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com