టాలీవుడ్ ను ఊపేస్తున్న బన్నీ తాజా సమాచారం
- January 04, 2022
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప’ చిత్రంతో బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ. 300కోట్ల పైచిలుకు గ్రాస్ వసూళ్ళను సాధించింది. ఇతర భాషల్లో సైతం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరిలో ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రంపైనే ఉంది అందరి దృష్టి. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ‘సరైనోడు’ సూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బోయపాటి ఇటీవల సీనియర్ హీరోతో ‘అఖండ’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
బోయపాటి ట్రేడ్ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. తన కెరీర్ లో ఇప్పటి వరకూ అతడు డ్యూయల్ రోల్స్ చేయలేదు. ఇంతకుముందు సీనియర్ హీరోతో బోయపాటి చేసిన మూడూ డ్యూయల్ రోల్స్ మూవీసే. మూడూ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందుకే బన్నీతో బోయపాటి చేయబోయే ఈ సినిమాపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తన స్టైల్లో హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు బోయపాటి. మరి నిజంగానే బన్నీచేత బోయపాటి డ్యూయల్ రోల్స్ చేయిస్తాడో లేదో చూడాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..