పేరు పెట్టండి, పేరు సంపాదించుకోండి' అని ట్యాగ్‌లైన్‌ తో ఆహ్వానిస్తున్న ఐపీఎల్‌ టీమ్‌

- January 04, 2022 , by Maagulf
పేరు పెట్టండి, పేరు సంపాదించుకోండి\' అని ట్యాగ్‌లైన్‌ తో ఆహ్వానిస్తున్న ఐపీఎల్‌ టీమ్‌

ముంబై: ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌కు చెందిన ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ లక్నో ..తమ టీమ్‌కు సరైన పేరు ఎంచుకునే పనిలో పడ్డది. టీమ్‌కు మంచి పేరు సజెస్ట్‌ చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. గతంలో తమ రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ టీమ్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను టీమ్‌ లక్నో ఐపీఎల్‌గా మార్చింది. డిస్‌ప్లే పిక్చర్‌గా లక్నో సిటీలోని చారిత్రక కట్టడం 'రూహి దర్వాజా'ను ఎంచుకుంది. 'ఈ పేరుకు మొదటి హక్కుదారులు మీరే. పేరు పెట్టండి, పేరు సంపాదించుకోండి' అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చింది. దీన్ని బట్టి లక్నో స్టయిల్లో తమ టీమ్‌కు సరైన పేరు పెట్టాలని ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ ప్లాన్‌ చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com