పాన్‌కార్డ్ హోల్డర్లకు హెచ్చరిక..

- January 04, 2022 , by Maagulf
పాన్‌కార్డ్ హోల్డర్లకు హెచ్చరిక..

న్యూ ఢిల్లీ: పాన్‌కార్డ్ నంబర్‌‌తో ఆధార్ అనుసంధానం చేసుకోమంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది.కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇచ్చిన గడువులోగా లింక్ చేయకపోతే పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు.పైగా రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.. ఏదైనా లావాదేవలను చేసే సమయంలో ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డ్‌ను అందజేస్తే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272 ఎన్ ప్రకారం.. సదరు వ్యక్తిపై 10వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్‌ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com