పెరుగుతున్న సైబర్ నేరాలు..వెబ్‌ బ్రౌజర్లలో పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేసేప్పుడు ఆలోచించండి..

- January 06, 2022 , by Maagulf
పెరుగుతున్న సైబర్ నేరాలు..వెబ్‌ బ్రౌజర్లలో పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేసేప్పుడు ఆలోచించండి..

ఫేస్‌బుక్‌ నుంచి మొదలు ఇన్‌స్టాగ్రామ్‌ వరకు.. నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి మొదలు మెయిల్‌ అకౌంట్స్‌ వరకు.. ప్రతీ ఒక్కదానికి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ తప్పనిసరి. ఇంటర్‌ వినియోగం విపరీతంగా పెరగడం, అందరికీ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రావడంతో వెబ్‌ బ్రౌజర్ల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో అన్ని రకాల పాస్‌వర్డ్‌లు, యూజర్‌ నేమ్‌లను గుర్తుంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. దీంతో చాలా మంది వెబ్‌ బ్రౌజర్లలో యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేసుకుంటారు.

ఇక లాగిన్‌ కావాల్సి వచ్చినప్పుడు నేరుగా మీ లాగిన్‌ వివరాలు సేవ్‌ అయి ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇలా బ్రౌజర్‌లో యూజర్ నేమ్‌, పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేసుకోవడం ఎంత వరకు మంచిది.? లాగిన్‌ వివరాలను బ్రౌజర్‌లో సేవ్‌ చేస్తే నష్టం జరుగుతుందా..? దీనికి టెన్‌ నిపుణులు ఏం సూచిస్తున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.. టెక్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం యూజర్లు వీలైనంత వరకు లాగిన్‌ వివరాలను గుర్తుంచుకోవడమే మంచిదని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.

బ్రౌజర్‌లో సేవ్‌ చేసుకోకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. బ్రౌజర్స్‌లో పూర్తి స్థాయి భద్రత ఉండదనేది నిపుణులు వాదన. ఒకవేళ బ్రౌజర్లలో ఏవైనా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను సేవ్‌ చేసుకుంటే వెంటనే డిలీట్ చేయండని నిపుణులు సూచిస్తున్నారు. బ్రౌజర్స్‌లో లాగిన్‌ వివరాలను సేవ్‌ చేస్తే.. సైబర్‌ దాడులు జరిగితే అప్పటికే సేవ్‌ అయిన లాగిన్‌ వివరాలను సులభంగా తస్కరించవచ్చని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com