కోవిడ్ సోకిన హెల్త్ వర్కర్లకు క్వారంటైన్ గడువు తగ్గింపు

- January 06, 2022 , by Maagulf
కోవిడ్ సోకిన హెల్త్ వర్కర్లకు క్వారంటైన్ గడువు తగ్గింపు

దోహా: హమాద్ మెడికల్ కార్పొరేషన్, తమ ఉద్యోగుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేయడం జరిగింది. కోవిడ్ 19 సోకిన హెల్త్ వర్కర్లకు క్వారంటైన్ పీరియడ్ తగ్గిస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఈ గడువు 10 రోజులు వుండగా, ఇప్పుడది ఏడు రోజులకు తగ్గించారు. కోవిడ్ పాజిటివ్ తేలిన తర్వాత ఏడవ రోజున ఎలాంటి లక్షణాలూ లేకపోతే, ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ వస్తే, ఎనిమిదవ రోజున ఆ కార్మికుడు లేదా కార్మికురాలు విధుల్లో చేరవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com