సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్
- January 07, 2022
యూఏఈ: డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాల గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుందని, వాటి బారిన పడొద్దని షార్జా పోలీసులు గురువారం ప్రజలను హెచ్చరించారు. సోషల్ మీడియా సర్క్యులేట్ అయ్యే వార్తల విశ్వసనీయత, ఖచ్చితత్వాన్ని చెక్ చేసుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు. డిపార్ట్మెంట్లోని ఖాళీల గురించి ఏదైనా సమాచారం కోసం డిపార్ట్మెంట్ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చట్టంలోని ఆర్టికల్ 52 ప్రకారం.. అధికారిక వర్గాలు ప్రచురించిన వార్తలకు విరుద్ధంగా తప్పుడు వార్తలు, పుకార్లు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగించే వారిపై కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 100,000 దిర్హామ్‌ల జరిమానా విధించవచ్చు. అలాగే తప్పుడు వార్తలు లేదా పుకార్ల ప్రచురణ రాష్ట్ర అధికారులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, సంక్షోభాలు సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 200,000 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







