కరోనా రూల్స్ ఉల్లంఘిస్తే SR1000 ఫైన్
- January 07, 2022
సౌదీ: సోషల్ డిస్టెన్స్, టెంపరేచర్ చెకింగ్ వంటి కరోనావైరస్ ముందు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలపై కఠినమైన శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం హెచ్చరించింది. గత 24 గంటల్లో 3000కి పైగా కేసులు నమోదైన నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఉల్లంఘనపై SR1,000 జరిమానా విధించబడుతుందని, ఉల్లంఘనలు పునరావృతమైతే, జరిమానాలు రెట్టింపు చేయబడతాయన్నారు. SR100,000 వరకు ఫైన్ వేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు హెల్త్ మినిస్ట్రీ కరోనావైరస్ సోకిన వ్యక్తుల రికవరీ వ్యవధిని సడలించింది. వ్యాక్సిన్ వేసిన వ్యక్తులకు రికవరీ వ్యవధిని ఏడు రోజులకు, వ్యాక్సిన్ వేయని వ్యక్తులకు 10 రోజులకు తగ్గించింది. రికవరీ పీరియడ్ పూర్తయిన తర్వాత వారి ఆరోగ్య స్థితి తవక్కల్నా అప్లికేషన్లో అప్డేట్ చేయబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







