మేజర్ నుండి రొమాంటిక్ సాంగ్ విడుదల
- January 07, 2022
హైదరాబాద్: ‘క్షణం’,‘అమీ తుమీ’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి వినూత్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న అడవి శేష్.. ప్రస్తుతం మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మేజర్ సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తుండగా.. ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగుతో పాటుగా హిందీ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుండి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదలైంది.
“హృదయమా” అనే సాంగ్ ను ఈరోజు మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు.మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ శ్రావ్యమైన సాంగ్ చాలా రొమాంటిక్ గా, ఉల్లాసంగా ఉంది. లిరికల్ వీడియో సినిమాలోని ప్రేమికుల మధ్య సుదూర సంబంధాన్ని సూచిస్తోంది.ఈ పాట చాలా ఆకర్షణీయంగా ఉంది.రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడే వారి ప్లేలిస్ట్ లో ఈ సాంగ్ టాప్ లో ఉంటుంది.ఈ రొమాంటిక్ సాంగ్ కు కృష్ణ కాంత్, విఎన్వి రమేష్ కుమార్ లిరిక్స్ అందించారు.శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’