పాస్‌పోర్టు సేవలు: టీసీఎస్‌కు భారీ కాంట్రాక్ట్!

- January 08, 2022 , by Maagulf
పాస్‌పోర్టు సేవలు: టీసీఎస్‌కు భారీ కాంట్రాక్ట్!

న్యూ ఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ రెండో దశ  కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ని ఎంపిక చేసింది, ఇది ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద మిషన్-క్రిటికల్ ఇ-గవర్నెన్స్ ప్రోగ్రామ్.ఈ డీల్ విలువ ఎంత అనేది  టీసీఎస్ ప్రకటించకపోయినప్పటికీ.. ఈ కాంట్రాక్ట్ విలువ ఏకంగా ఆరు వేల కోట్లు ఉండొచ్చని సమాచారం. పాస్‌పోర్టు సంబంధిత సేవలను మరింత సమర్థవంతంగా, ప్రజలకు సులువుగా చేరేలా అమలు చేసేందుకు ప్రభుత్వం 2008లో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.వీలైనంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం తీసుకొచ్చింది. అయితే.. ప్రస్తుతమున్న కేంద్రాల్లో ప్రపంచస్థాయి సేవలు అందుతుండటంతో వీటిపై ప్రజల్లో  సదభిప్రాయం నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండో విడత అమలు బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించింది. ఈ విడతలో టీసీఎస్ ప్రస్తుతమున్న కేంద్రాలను మరింత మెురుగు పరచడంతో పాటూ ఈ పాస్‌పోర్టుల జారీకి సంబంధించి మరిన్ని నూతన విధానాలను అందుబాటులోకి తెస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com