రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి..

- January 09, 2022 , by Maagulf
రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తి..

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు.. మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో టాలీవుడ్‏లో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాదపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రమేష్ బాబు మృతి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కరోనా బారిన పడడంతో కడసారి అన్నను చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అన్న మరణంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అన్నను కడసారి చూసుకోలేని పరిస్థితిలో ఉన్న మహేశ్‌ను ఓదార్చుతున్నారట మహేష్ వైఫ్ నమ్రత. ఎప్పుడూ వీడియో కాల్ చేస్తూ.. మహేష్‌తో మాట్లాడుతూ.. ఆయనలో ధైర్యం నింపుతున్నారట నమ్రత. అంతేకాదు అంత్యక్రియల్లో మహేష్ లేని లోటును తీర్చేందుకు కూడా ప్రయత్నించారు నమ్రత. రమేష్ బాబు భార్య, పిల్లల్ని ఓదార్చుతూ.. వారికి తోడుగా ఉన్నారు.

రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్‏లోని మహాప్రస్థానంలో నిర్వహించిన రమేష్ బాబు అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ బాబుకు తుది వీడ్కోలు పలికారు. ఆయన ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రమేష్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com