హెచ్ఏఎల్ లో ఉద్యోగాలు
- January 09, 2022హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నిషియన్ అప్రెంటీస్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా.. కేవలం అకడామిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా రూ.8,000 నుంచి రూ.9,000 వరకు స్టైఫండ్ అందజేస్తారు.
టెక్నిషియన్, అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు సంబంధించి 80 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దరఖాస్తుకు అర్హులు.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు సంబంధించి 70ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దరఖాస్తుకు అర్హులు
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2022 నుంచి జనవరి 17, 2022 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారక వెబ్సైట్ https://portal.mhrdnats.gov.in/
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు