షార్జా వెళ్లే విమానప్రయాణికులకు శుభవార్త!

- January 10, 2022 , by Maagulf
షార్జా వెళ్లే విమానప్రయాణికులకు శుభవార్త!

న్యూఢిల్లీ: భారతీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ షార్జా వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని మూడు నగరాల నుంచి షార్జాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది. జనవరి 7 నుంచి పుణే, మదురై, మంగళూరు నుంచి షార్జాకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.ఇక ఈ మూడు నగరాల నుంచి షార్జాకు వెళ్లే విమాన సర్వీసుల షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే.. 

  • పుణే టు షార్జా: డైలీ రాత్రి 9.05 గంటలకు విమానం బయల్దేరుతుంది. షార్జా విమానాశ్రయానికి రాత్రి 11.10 గంటలకు చేరుకుంటుంది.
  • మదురై టు షార్జా: వీక్లీ నాలుగు సర్వీసులు మాత్రమే. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.
  • మంగళూరు టు షార్జా: వారంలో నాలుగు సర్వీసులు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు తెల్లవారుజామున 12.55 గంటలకు చేరుకుంటుంది. ఇలా స్పైస్‌జెట్ ఈ మూడు నగరాల నుంచి వారానికి మొత్తం 15 విమాన సర్వీసులు నడపనుంది.ఇక పుణే విమానాశ్రయం నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ విమానం జనవరి 7న వెళ్లింది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com