భార్యల మార్పిడి రాకెట్‌..1000జంటల నిర్వాకం

- January 10, 2022 , by Maagulf
భార్యల మార్పిడి రాకెట్‌..1000జంటల నిర్వాకం

కేరళ: భార్యల మార్పిడి రాకెట్ అనేది సభ్యసమాజం తలదించుకునే అంత్యంత హేయమని రాకెట్ ను పట్టుకున్నారు పోలీసులు.కేరళలో భార్యల మార్పిడి రాకెట్ గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతోంది.పెచ్చరిల్లిని లైంగిక సంబంధాలకు భార్యల మార్పిడి రాకెట్ నిదర్శనంగా కనిపిస్తోంది.మితిమీరిన లైంగిక సంబంధాల కోసం ఓ భర్త తన భార్యను మార్పిడి చేయటానికి యత్నిస్తున్న క్రమంలో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణమైన రాకెట్ బయటపడింది. ఆ దారుణమైన ప్రక్రియలో 1000 జంటల ప్రమేయం ఉండటం షాక్ కు గురిచేస్తోంది.

వేరే వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని బలవంతపెడుతున్న భర్త బాధితురాలి ఫిర్యాదుతో ఈ దారుణ రాకెట్ గురించి వెలుగులోకి వచ్చింది.భార్యల మార్పిడి రాకెట్ లో వేరే వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని బలవంతపెడుతున్న భర్త ఆగడాలు భరించలేని ఓ బాధతురాలు కారుకాచల్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.కేరళలో జరగుతున్న ఈ భార్యల మార్పిడి రాకెట్ భాగోతాన్ని బయటపెట్టారు పోలీసులు. ఏడుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.గతంలో కాయంకుళం ప్రాంతంలో కూడా ఇటువంటివే జరిగాయి.భార్యల మార్పిడి రాకెట్ కేరళ రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను ఉపయోగించుకుంటోందని పోలీసులు తెలిపారు.

భార్యలను మార్పిడి రాకెట్ గురించి చంగంచెరి డీఎస్పీ ఆర్.శ్రీకుమార్ మాట్లాడతు..దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలు కనుగొన్నారు. ఈ రాకెట్ గురించి డీఎస్పీ మాట్లాడుతూ...ఈ రాకెట్ ముఠాగా ఏర్పడి టెలిగ్రామ్, మెసెంజర్ గ్రూపులలో చేరారని..అలా ఒకరికొకరు కనెక్ట్ అవుతారని తెలిపారు. భర్త అరాచకాలు భరించలేకి బయటకొచ్చి ఫిర్యాదు చేసిన మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నామని..ఈ రాకెట్ వెనుక చాలామంది పాత్ర ఉందని తెలిపారు. ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశామని..మరికొంత మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.

నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్‌లో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. భార్యల మార్పిడి బాగోతంపై 25 మంది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని..అతి త్వరలోనే మరింత మందిని పట్టుకుంటామని కేరళ పోలీసులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com