కొత్త గ్లోబల్ రిపోర్టింగ్ ఫార్మాట్ అమలు చేస్తున్న బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్

- January 10, 2022 , by Maagulf
కొత్త గ్లోబల్ రిపోర్టింగ్ ఫార్మాట్ అమలు చేస్తున్న బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్

బహ్రెయిన్: రన్ వే సంబంధిత అంశాలపై మెరుగైన భద్రత కోసం బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ కంపెనీ, గ్లోబల్ రిపోర్టింగ్ ఫార్మాట్‌ని అమలు చేస్తోంది. నవంబర్ నుంచి జిపిఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా అమలవుతోంది. రన్ వే విషయంలో తలెత్తే సమస్యలను గణనీయంగా తగ్గించేందుకు ఈ జీపీఎఫ్ ఉపయోగపడుతుంది. చిన్నపాటి మార్పులను సైతం ఎప్పటికప్పుడు పైలట్‌కి తెలియజేసేలా ఈ సాంకేతిక ఉపయోగపడుతుంది. తద్వారా రన్ వే సమస్యల వచ్చే ప్రమాదాల్ని నియంత్రించవచ్చు. టేకాఫ్ మరియు ల్యాండింగ్ కండిషన్లపై మెరుగైన సమాచారం పైలట్లు, క్రూ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com