సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు

- January 10, 2022 , by Maagulf
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు

Covid in UAE: Authorities issue warning as social media posts mock safety protocols

యూఏఈ: కోవిడ్ 19 సేఫ్టీ ప్రోటోకాల్స్ విషయమై సోషల్ మీడియా వేదికగా పుకార్లను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అథారిటీస్ హెచ్చరించాయి. ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ - ఎమర్జెన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ ప్రాసిక్యూషన్, సోషల్ మీడియాలో నడుస్తున్న పుకార్లపై అసహనం వ్యక్తం చేసింది. అల్ హోస్న్ యాప్ గురించీ అలాగే ఆడియో వీడియో క్లిప్పింగుల ద్వారా సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం మొదలు పెట్టారు. కోవిడ్ మీద జరుగుతున్న పోరాటంలో ఇవి బాధ్యతారాహిత్యమైన చర్యలుగా అథారిటీస్ అభివర్ణించాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రాసిక్యూషన్ ప్రకటనలో పేర్కొంది.జరిమానాలు అలాగే జైలు శిక్షలు కూడా ఈ నేరాలకు పాల్పడేవారికి విధించడం జరుగుతుంది. కనీసం ఏడాది జైలు శిక్ష అలాగే 100,000 దిర్హాముల వరకు దోషులకు జైలు శిక్ష పడే అవకాశం వుంటుంది.

--నవీన్.వై (మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com