డాక్టర్ జీవితాన్ని మార్చిన సంఘటన..
- January 10, 2022
బెంగుళూరు: వైద్యులు తమ వృత్తిని ఉద్యోగంగా భావిస్తే దానికి వంద శాతం న్యాయం చేయలేరు. తాము చదువుకున్న చదువుకి సార్ధకత ఉండాలని ప్రతి ఒక్క డాక్టర్ భావిస్తుంటారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ సునీల్ కుమార్ ఓ రోజు హోసూర్-చెన్నై హైవే మీదుగా ప్రయాణిస్తున్నారు. అతడి కళ్ల ముందే జరిగిన యాక్సిడెంట్లో ఓ వ్యక్తి అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే డాక్టర్ సునీల్ మరో ఆలోచనలేకుండా అతడికి ప్రధమ చికిత్స అందించి సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లి సకాలంలో వైద్యం అందేలా చూశారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడికి చికిత్స చేసి ప్రాణం పోశారు. ఒక రోజు గడిస్తే కానీ చెప్పలేం అన్న వైద్యులు సకాలంలో చికిత్స అందడంతోనే అతడు కోలుకున్నాడని అతడి తల్లికి చెప్పారు. దాంతో బాధితుడి తల్లి డాక్టర్ సునీల్‌కి కాల్ చేసి కృతజ్ఞతలు తెలిపింది. డాక్టర్‌ని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఆ ఒక్క సంఘటన డాక్టర్ సునీల్ జీవితాన్నే మార్చేసింది. తన భవిష్యత్ ప్రణాళికలన్నీ మార్చుకునేలా చేసింది. చివరికి 2011లో అతను BGS గ్లోబల్ హాస్పిటల్స్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి మాతృ సిరి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..