పోలీసు సిబ్బందికి ఎటువంటి ఆపదలు వచ్చినా నేను అండగా ఉంటా:ఏపీ డిజిపి
- January 10, 2022
అమరావతి: ఏపీలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారి కుటుంబాలకు ఎటువంటి ఆపదలు కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చారు.ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీ-2022 ను ఆవిష్కరించిన డిజిపి ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ...క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందికి ఉపయోగపడే ప్రభుత్వ ఉత్తర్వులు,సంక్షేమ కార్యక్రమాలు,ప్రభుత్వ మరియు శాఖాపరమైన సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారాన్ని ఈ డైరీ ద్వారా సిబ్బందికి అందజేయడం పై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులను అభినందించారు.
రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ...గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకొని ఈ నూతన సంవత్సరంలో కూడా సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వర్తించి, ప్రజలకు విలువైన, నాణ్యమైన సేవలు అందించడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..