తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 10, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. నిన్నటితో (1,673) పోలిస్తే కొత్త కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 70 వేల 697 టెస్టులు చేయగా 1,825 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఒకరు కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 351 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14వేల 995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో 1042 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత మల్కాజ్గిరిలో 201 కేసులు రాగా.. రంగారెడ్డిలో 147 కొవిడ్ కేసులు వచ్చాయి.
కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగించింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు కఠినతరం చేసింది ప్రభుత్వం.
రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో, షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరి మాస్కు ధరించాలి. మాస్కు లేదంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం విధించింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..