50% స్టాఫ్ తోనే పని చేయనున్న గవర్నమెంట్ ఆఫీసులు
- January 11, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ కార్యాలయాలు 50% సిబ్బందితోనే పనిచేయనున్నాయి. ప్రైవేట్ కార్యాలయాలలో కూడా సిబ్బందిని తగ్గించాలని అదేశించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో వేలిముద్రల వ్యవస్థను నిలిపివేసి, స్టేట్ మెంట్ తో హాజరును తీసుకోవాలని సివిల్ సర్వీస్ కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య 50% మించకుండా పని గంటలను నిర్ణయించాలని కూడా తెలియజేసింది. ప్రైవేట్ రంగంలోనూ సిబ్బంది సంఖ్యను కనీస స్థాయికి తగ్గించాలని సూచించింది. నర్సరీలు, పిల్లల క్లబ్ లో పనిచేసే వారు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ పూర్తి డోసులు పొంది ఉండాలి. జనవరి 12 నుండి ప్రజా రవాణాల కేవలం 50% మంది ప్రయాణికులతోనే నడువనున్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొనే వారు కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు కరోనా నిబంధనలను పాటించాలి. సెలూన్లు, బార్బర్ షాపులు, హెల్త్ క్లబ్‌ల సిబ్బంది, వచ్చే వారు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాలు ఆన్లైన్ ద్వారా సేవలను అందించాలని, అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే ఫిజికల్ అప్లికేషన్స్ తీసుకోవాలని సర్క్యులర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..