పెట్రోలియం సెక్టర్లో పెరిగిన కువైటైజేషన్ రేట్

- January 11, 2022 , by Maagulf
పెట్రోలియం సెక్టర్లో పెరిగిన కువైటైజేషన్ రేట్

కువైట్: కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (కెపిసి), దాని అనుబంధ సంస్థలలో 2021 చివరి నాటికి కువైటైజేషన్ రేట్ 93 శాతం వరకు స్థిరంగా పెరిగాయి. చమురు రంగం కువైటీకరణకు సంబంధించిన అధికారిక డేటా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అదేవిధంగా, చమురు కంపెనీలలో కువైట్ పెట్రోలియం ఇంటర్నేషనల్ కంపెనీ అత్యధికంగా 98.39 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. 98 శాతంతో కువైట్ గల్ఫ్ ఆయిల్ కంపెనీ (కేజీఓసీ) తర్వాతి స్థానంలో ఉంది. అత్యధిక సంఖ్యలో జాతీయ కార్మికులను కలిగి ఉన్న కువైట్ ఆయిల్ కంపెనీ (KOC), దాని కువైటైజేషన్ రేటు 90.86 శాతానికి చేరుకుంది. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) కువైటైజేషన్ రేటు 89.4 శాతం, కువైట్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (KPIC) 94 శాతంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఉత్తర ప్రాంతంలో కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఒసామా అల్-ఒటైబి నేతృత్వంలోని మున్సిపల్ కౌన్సిల్ సోమవారం తన రెగ్యులర్ సెషన్‌లో ఆమోదం తెలిపింది. కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ కోసం నిర్దేశించిన సైట్‌లో స్టోరేజ్ యాక్టివిటీని పెంచాలని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన అభ్యర్థనకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు పబ్లిక్ మార్కెట్‌ల నియంత్రణకు సంబంధించిన ముసాయిదా మంత్రివర్గ నిర్ణయాన్ని కౌన్సిల్ ఆమోదించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com