కొత్త పార్కింగ్ పర్మిట్ సర్వీసుని ప్రకటించిన యూఏఈ
- January 11, 2022
యూఏఈ: యూఏఈ డిపార్టుమెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ మరియు ట్రాన్స్పోర్ట్, రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ సర్వీసు యాప్ విషయమై ప్రకటన చేసింది. కొత్త విధానం ద్వారా వినియోగదారులు కొత్త రెసిడెంట్ పార్కింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, గడువు తతీరిన పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడం వంటివాటి కోసం కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన పని వుండదు. వాహన సమాచారం లేదా రెసిడెన్స్ సమాచారాన్ని మార్చేందుకూ అవకాశం ఈ కొత్త విధానం ద్వారా లభిస్తుంది. ‘దర్బ్’ వెబ్సైట్ లేదా దర్బ్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలు అందుబాటులో వుంటాయి. సర్వీసు ఫీజు అలాగే మవాకిఫ్ జరీమానాలు చెల్లించేందుకు కూడా మరింత వీలు కల్పించారు. సర్వీసు ఫీజుల్ని అలాగే జరీమానాల్ని ఒకే వేదికపై చెల్లించడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







