రోడ్డు పై గుట్టలుగా రూ.2వేల నోట్ల కట్టలు..
- January 12, 2022
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి.మాదాపూర్ పరిధిలో రూ.2వేల నకిలీ కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి.నడిరోడ్డుపై గుట్టలుగా పోసిన కరెన్సీ నోట్లను చూసి అటుగా వెళ్లే జనమంతా ఎగబడి చూస్తున్నారు.100 ఫీట్ రోడ్ సమీపంలోని కాకతీయ రోడ్డులో రూ.2వేల కరెన్సీ నోట్లు గుట్టలుగా పోసి ఉంచారు. నోట్లను చూసిన వెంటనే స్థానికులు, వాహనదారులు కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు.
దొరికిన కరెన్సీ నోట్లను చాలామంది అందుకుపోయారు. రూ.2వేల నోట్లపై చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండటంతో నోట్లు తీసుకెళ్లినవారంతా నిరుత్సాహానికి గురయ్యారు. నకిలీ కరెన్సీ నోట్లని తెలియక చాలామంది నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు.
రోడ్లపై గుట్టలుగా పడి ఉన్న నకిలీ రూ.2వేల కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గత ఏడాదిలో హైదరాబాద్ నగరంలోని గోల్కండ పరిధిలో నకిలీ కరెన్సీ కలకం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లతో సంబంధం కలిగిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో దగ్గర లభ్యమైన సంచుల్లో రూ.2వేలు, రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







