సౌదీ డకార్ ర్యాలీ విజేతలు ఖతార్, బ్రిటన్
- January 16, 2022ఖతార్: శుక్రవారం జెడ్డాలో జరిగిన సౌదీ డకార్ ర్యాలీ లో నాసర్ అల్-అత్తియా తన నాల్గవ డకార్ ర్యాలీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. కొత్త సంవత్సరం రోజున నిర్వహించిన మొదటి స్టేజ్ నుంచి అతను ఆధిక్యం సాధిస్తున్న విషయం తెలిసిందే. అల్-అత్తియా తన సమీప ప్రత్యర్థి సెబాస్టియన్ లోబ్ను 12వ రౌండ్ లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ తేడాతో ఓడించాడు. ఓవరాల్ గా మొత్తం 27 నిమిషాల కంటే ఎక్కువ ఆధిక్యంతో విజయం సాధించాడు. అలాగే బ్రిటీష్ రైడర్ సామ్ సుందర్లాండ్ తన రెండవ డాకర్ మోటార్‌బైక్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. స్టేజీ విన్నర్ చిలీకి చెందిన పాబ్లో క్వింటానిల్లాను 3 1/2 నిమిషాల తేడాతో ఓడించాడు. ఇది 1994 నుండి అత్యంత సమీప మార్జిన్ కావడం విశేషం.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు