సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం
- January 16, 2022
హైదరాబాద్: హైదరాబాద్, జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని సికింద్రాబాద్ క్లబ్ లో ఆదివారం తెల్లవారు ఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో క్లబ్ లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసి పడటంతో క్లబ్ మొత్తం పూర్తిగా తగలబడిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. సుమారు 10 అగ్నిమాపక యంత్రాలు అగ్నికీలలను అదుపు చేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం తెల్లవారుఝామున జరగటంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సికింద్రాబాద్ క్లబ్లో రూ. 15 లక్షలు కడితేనే మెంబర్షిప్ లభిస్తుంది.1878లో బ్రిటీష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ సికింద్రాబాద్ క్లబ్ ను నిర్మించారు.ఈ తెల్లవారు ఝామున జరిగిన అగ్నిప్రమాదంలో ప్రధాన భవనం పూర్తిగా కాలిపోయింది. ఈ భవనంలోనే కిచెన్ తో పాటు క్లబ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







