రెండు ఉమ్రాల మధ్య 10 రోజుల విరామం తప్పనిసరి
- January 17, 2022
సౌదీ అరేబియా: విదేశీ యాత్రికులతో సహా అన్ని వయసుల యాత్రికులకు రెండు ఉమ్రా పర్మిట్‌ల జారీకి మధ్య 10 రోజుల విరామాన్ని తప్పనిసరి చేస్తూ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ యాత్రికులు తమ 30 రోజుల పర్మిట్ లో గరిష్టంగా మూడు ఉమ్రాలను చేయవచ్చు. పర్మిట్ పొందిన యాత్రికుడు, మొదటి ఉమ్రా తర్వాత 10 రోజుల గ్యాప్ లో ఈట్‌మార్నా లేదా తవక్కల్నా యాప్ ద్వారా రెండవ ఉమ్రా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే తవక్కల్నాలో రోగనిరోధక ఆరోగ్య స్థితి కేటగిరీ లో ఉన్న 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులందరూ గ్రాండ్ మసీదులో ఉమ్రా, ప్రార్థన చేయడానికి అనుమతించబడతారు. COVID-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు, నివారణ ప్రోటోకాల్ లో భాగంగా 10 రోజుల పరిమితిని విధించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







