భారత్ కరోనా అప్డేట్
- January 17, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి.ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు.దేశంలో ప్రస్తుతం 16,56,341 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.కరోనా కేసుల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టినా పాజిటివిటీ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.సుమారు 157 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.భారత్‌లోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







