హక్కుల గురించి ప్రవాస కార్మికులకు అవగాహన

- January 17, 2022 , by Maagulf
హక్కుల గురించి ప్రవాస కార్మికులకు అవగాహన

కువైట్: కువైట్‌లోని వలస కార్మికుల లక్ష్యంగా మానవ హక్కుల కోసం కువైట్ సొసైటీ ఒక కార్యాచరణను నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ని USMiddle East Partnership Initiative (MEPI) భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. చట్టం ద్వారా హామీ ఇవ్వబడిన వారి హక్కుల గురించి కువైట్‌లోని వలస కార్మికులకు అవగాహన కల్పించడంలో, వారికి చట్టపరమైన, సామాజిక మద్దతును అందించనున్నారు. 2010 నాటి కువైట్ లేబర్ లా నం. 6కి లోబడి ఉన్న ప్రైవేట్ రంగంలోని కార్మికులకు లేదా డొమెస్టిక్ లేబర్ లా నెం. 68కి లోబడి ఉండే గృహ రంగంలోని కార్మికులకు న్యాయ సలహా, సహాయాన్ని అందించడంపై ప్రాజెక్ట్ పని చేస్తుంది. కార్మికులు హాట్‌లైన్ నంబర్. 22215150కి కాల్ చేసి, అరబిక్, ఇంగ్లీష్, ఫిలిపినో, హిందీ, ఉర్దూ భాషలలో ఈ సేవలను పొందవచ్చు. లేదా ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ www.togetherkw.orgని ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. 2021 సంవత్సరంలో 4,808 వలస కార్మికులకు అసోసియేషన్ న్యాయ సలహాలు అందించింది. 4,417 న్యాయ సలహాలు ఈ క్రింది భాషలలో హాట్‌లైన్ ద్వారా అందించబడ్డాయి. 1,301 హిందీ , 1,021 అరబిక్ , 930 ఫిలిపినో , 847 ఇంగ్లీష్ , 318 ఉర్దూ , 391 అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో సేవలు అందించారు. మొత్తం 366 ఫిర్యాదులను అసోసియేషన్ స్వీకరించింది. ఇందులో 282 కేసులు సామరస్యంగా పరిష్కరించగా, 84 కేసులు కోర్టుకు రిఫర్ చేయబడ్డాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com