ఖతార్లో కోవిడ్-19 బారిన పడి 3 వారాల పాప మృతి
- January 17, 2022
ఖతార్: తీవ్రమైన కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ కారణంగా ఖతార్లో మూడు వారాల పాప ఆదివారం మరణించిందని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ట్వీట్లో వెల్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. తాజా వేవ్ లో ప్రస్తుతం చాలా మంది పిల్లలు వ్యాధి బారిన పడుతున్నారనే వాస్తవాన్ని హైలైట్ చేసింది. గత సంవత్సరం నుండి కోవిడ్ -19 ఫలితంగా మరణించిన రెండవ పాప. గతంలో వైరస్ సోకి 11 ఏళ్ల చిన్నారి మరణించాడు.
అన్ని వయసుల వారు కోవిడ్ -19 బారిన పడే ప్రమాదం ఉందని, ప్రపంచంలోని చాలా దేశాలు చిన్న పిల్లల మరణాలు నమోదు అవుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కోవిడ్-19 కారణంగా ఖతార్లో మొత్తం మరణాల సంఖ్య 626కి పెరిగింది. దేశంలో 4,021 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 40,600కి పెరిగింది. కోవిడ్-సంబంధిత లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు ధరించి స్వీయ-పరిశుభ్రతను పాటించాలి అని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం