ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ..

- January 17, 2022 , by Maagulf
ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ..

తెలంగాణ: బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ లో తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఇ  – గ్రీన్కోతో  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల ఒప్పంద ఎంఓయూపై సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ, పరిశ్రమలు- వాణిజ్యం, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫార్ములా ఇ అసోసియేషన్ , గ్రీన్‌కో అనిల్ చలమలశెట్టి(సి.ఈ.ఓ)తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కు వేదికైందన్నారు. నవంబర్ నుండి మార్చి మధ్యలో ఫార్ములా- ఈ రేస్ కు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనుంది. హైదరాబాద్ లో త్వరలో మొబిలిటీ క్లస్టార్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందన్నారు.

ఈ సంవత్సరాంతంలో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో మూడురోజుల పాటు ఈవీ ఎక్స్పో నిర్వహిస్తాం. తద్వారా ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కంపెనీలకు వివరిస్తామన్నారు.

ఎలక్ట్రిక్ మొబిలిటీను ప్రోత్సహించే  రేస్ ఫార్ములా ఈ. సీతారాంపూర్, దివిటిపల్లి, షాబాద్ లో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ ఈవీ గమనంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com