ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- January 18, 2022_1642446007.jpg)
దోహా: "సంక్రాంతి" తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే ఈ "పెద్ద పండుగ" ను ఖతార్ దేశం లోని "ఆంధ్ర కళా వేదిక" కొత్త నిర్వహణ కమిటీ వెంకప్ప భాగవతుల అధ్యక్షతన వైభవంగా నిర్వహించుకుంది.
ఖతార్ లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, మేడమ్ అంబాసిడర్ డాక్టర్ అల్పనా మిట్టల్ మరియు ఐసిసి సమన్వయ అధికారి జేవియర్ ధన్ రాజ్ ఇండియన్ కల్చరల్ సెంటర్ లోని అశోకా హాల్ లో మహిళలు వేసిన ముగ్గులను తిలకించి అలాగే గాలిపటాలను ఎగురవేసి, కార్యక్రమంలో పాల్గొని తమ అభినందనలను తెలియజేసారు.
రంగోలి మేళాలో విజేతలుగా 3వ స్థానంలో గాయత్రి మొగరాలా 2వ స్థానంలో కవితా మురళీ మురుగన్ మరియు మొదటి స్థానంలో నీరజా రెడ్డి కందుల నిలిచారు. వీరికి ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నిర్వచించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఐసిసి అధ్యక్షుడు పిఎన్ బాబురాజన్, ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ కె.ఎస్ ప్రసాద్, మరియు ఐసిబిఎఫ్ అధ్యక్షుడు జియాద్ ఉస్మాన్, రజని మూర్తి తో పాటుగా మణికంఠన్,వినోద్ నాయర్,సుబ్రహ్మణ్య హెబ్బగులు,సబిత్ సాహిర్, వంటి అనేక మంది ప్రముఖులు మరియు ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్ర కళా వేదిక కొత్త మేనేజ్ మెంట్ బృందం ప్రమాణ స్వీకారం, సాంస్కృతిక కార్యక్రమాలు, గొబ్బిళ్ళ నాట్యాలు, హరిదాసు మరియు గోదాదేవి అలంకరణలో పిల్లలు, పిల్లలకి భోగిపళ్లు మరియు కార్యనిర్వాహకవర్గ కుటుంబాలు తయారు చేసిన రుచికరమైన తెలుగింటి వంటలు సాయంత్ర కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి శిరీషా రామ్ మరియు శ్రీసుధ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ప్రారంభ సందేశాన్ని మరియు అధ్యక్షులు వెంకప్ప భాగవతుల ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి