UAEలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

- January 18, 2022 , by Maagulf
UAEలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

యూఏఈ: కరోనా విజృంభణ నేపథ్యంతో యూఏఈలో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి.  ఉమ్ అల్ క్వైన్‌లోని 70 శాతం ప్రభుత్వ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన ఉద్యోగులు కార్యాలయం నుండి పని చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ ముందుజాగ్రత్త చర్యగా జనవరి చివరి వరకు ఈ వ్యవస్థ అమలులో ఉంటుందని తెలిపింది. వర్క్ ప్రాంతంలో తగినంత సామాజిక దూరంతో సహా అన్ని కోవిడ్ భద్రతా ప్రోటోకాల్‌లకు ఉద్యోగుల పాటించాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సర్క్యులర్  స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com