వృద్ధులకు ఇంట్లోనే కోవిడ్-19 బూస్టర్ షాట్
- January 18, 2022
ఖతార్: అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులను ఇంటి దగ్గరే కోవిడ్-19 బూస్టర్ షాట్ తీసుకోవచ్చని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) ప్రకటించింది. మూడవ వేవ్‌ను నియంత్రించే ప్రయత్నంలో పెద్ద మొత్తంలో బూస్టర్ షాట్‌లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత వారంలోనే 125,000 కంటే ఎక్కువ కోవిడ్-19 బూస్టర్ షాట్‌లను అందించినట్లు పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. MoPH వ్యాక్సినేషన్స్ హెడ్ డాక్టర్ సోహా అల్-బయత్ మాట్లాడుతూ.. ప్రజలు వారి రెండవ వ్యాక్సిన్ షాట్ తర్వాత ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. బూస్టర్ డోస్ COVID-19కి వ్యతిరేకంగా రక్షణ వ్యవస్థను గణనీయంగా పెంచుతుందన్నారు. తేలికపాటి ఇన్ఫెక్షన్ నుండి 75% రక్షణ, తీవ్రమైన ఇన్ఫెక్షన్ నుండి 90% కంటే రక్షణ అందిస్తుందన్నారు. ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆయన.. 2020లో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఖతార్‌లో అత్యధిక సంఖ్యలో జనవరి 12న 4,206 కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఖతార్ వ్యాక్సినేషన్ సెంటర్ పెద్ద కంపెనీల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బూస్టర్ షాట్‌ను అందిస్తోందని, జనవరి 9న ప్రారంభమైన బూస్టర్ షాట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పటివరకు 100,000 కంటే ఎక్కువ మోతాదులను అందించినట్లు డాక్టర్ సోహా అల్-బయత్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..