శరణార్థుల దుస్థితిపై అవగాహన: షేక్ అస్మా, యూఎన్‌హెచ్‌సిఆర్ సంయుక్త ప్రణాళిక

- January 18, 2022 , by Maagulf
శరణార్థుల దుస్థితిపై అవగాహన: షేక్ అస్మా, యూఎన్‌హెచ్‌సిఆర్ సంయుక్త ప్రణాళిక

ఖతార్: షేకా అస్మా అల్ థని, అంటర్కిటికాలో అత్యంత ఎత్తయిన ప్రాంతం మౌంటెయిన్ విన్సెంట్‌ని అధిరోహించి, వార్తల్లోకెక్కారు. 111 కిలోమీటర్ల అడ్వాన్సుడ్ స్కీయింగ్ చేసిన తొలి ఖతారీ మహిళగా ఆమె రికార్డులకెక్కారు. కాగా, యూఎన్‌హెచ్‌సిఆర్, షేకా ఆస్మాతో శరణార్థుల దుస్థితిపై అవగాహన కల్పించే కార్యక్రమం కోసం భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. తామున్న ప్రాంతంలో జీవించలేని పరిస్థితుల్లో వేరే చోటకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు ెదుర్కొంటున్నవారి సమస్యల్ని అర్థం చేసుకోవడం అవసరమని ఈ సంద్భంగా షేకా ఆస్మా పేర్కొన్నారు. 84 మిలియన్ల మంది ఇలా శరణార్థులుగా మారారని ఆమె చెప్పారు. ఆయా వేదికలపై ఈ సమస్యకు సంబంధించి తాను ప్రస్తావిస్తూనే వుంటానన్నారు. కాగా, తొలి మిడిల్ ఈస్ట్ మహిళగా ఎక్స్‌ప్లోరర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయాలనే పట్టుదలతో రెండేళ్ళ నుంచీ పనిచేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com