1400 మందికి పైగా ఖాకీలకు కరోనా
- January 18, 2022
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు.తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు. అలాగే సైబరాబాద్‌లో 150 మంది పోలీసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 110 మందికి వైరస్ సోకినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు సీరియస్ క్రైమ్స్విషయంలో తప్ప బాధితులు కంప్లయింట్ చేసేందుకు పీఎస్‌కు రావొద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దానికి బదులుగా ఆన్లైన్లో కంప్లయింట్ చేయాలంటున్నారు.కొన్ని పీఎస్‌ల పరిధిలో కంప్లయింట్స్ ఫైల్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా తగ్గేవరకూ తమ సూచనలు పాటించాలంటున్నారు పోలీసు అధికారులు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!