భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు
- January 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.రోజు వారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉంది.
ఇప్పటివరకు భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది. అటు కరోనా మరణాల సంఖ్య 4,87,202కి పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 158,88,47,554 వ్యాక్సిన్ డోసులను అధికారులు పంపిణీ చేశారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మంగళవారం నాటితో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు 0.79 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







